Header Ads Widget

ఆహ్వానము - గోటి తలంబ్రాలు ఊరేగింపు



శ్రీ సీతా రామ కళ్యాణం అనేది సనాతన ధర్మంలో ప్రముఖమైన మరియు పవిత్రమైన వేడుక. అట్టి సీతా రామ కళ్యాణ వివాహం అత్యంత సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్దతిలో నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవంలో "తలంబ్రాలు" అను ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. ఈ తలంబ్రాలు తలా మీద కురిపించడం ఒక సాంప్రదాయద్దమైన ఆనందోత్సవం. ఈ తలంబ్రాలను శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు రామ నామము జపిస్తూ అత్యంత భక్తితో చేతితో ఒలవడము జరుగుతుంది. ఇలా కొలిచిన తలంబ్రాలును ప్రతి సంవత్సరం ఊరేగింపు జరిపినట్టు, ఈ సంవత్సరం కూడా ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి టి.ఎస్.ఐ.ఐ.సి కాలనీ వరకు ఊరేగింపు జరుగుతుంది.
ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు


తేదీ : 2 ఏప్రిల్ 2025 బుధవారం
సమయం : ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు భజన
ఉదయం 9 గంటల నుంచి తలంబ్రాలు ఊరేగింపు
స్థలం : ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం
సంజయ్ గాంధీ నగర్, గాజుల రామారం రోడ్డు,
షాపూర్ నగర్, భాగ్యనగర్

గమనిక : ఉదయం 9.00 గంటల లోపు ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయంకు చేరుకోగలరని మనవి.

ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయంకు మార్గం

సికింద్రాబాద్ నుంచి : సికింద్రాబాద్ జీడిమెట్ల వెళ్లే బెస్ట్ నుంచి గండిమైసమ్మ, సూరారం, అపురూప కాలనీ, దుండిగల్ మొదలగు పేర్లుతో ఉండే బస్సు ఎక్కి షాపూర్ నగర్ టికెట్ తీసుకొని, షాపూర్ నగర్ గాజుల రామారం రోడ్డు దగ్గర దిగి ఆటో ద్వారా ఏడుగుడులకు చేరుకోవచ్చు.

అమీర్ పేట వైపు నుంచి : గండిమైసమ్మ, సూరారం, అపురూప కాలనీ, దుండిగల్ మొదలగు పేర్లుతో ఉండే బస్సు ఎక్కి షాపూర్ నగర్ టికెట్ తీసుకొని, షాపూర్ నగర్ గాజుల రామారం రోడ్డు దగ్గర దిగి ఆటో ద్వారా ఏడుగుడులకు చేరుకోవచ్చు.

గమనిక : ఏ ప్రాంతం నుంచి అయినా 171 నెంబర్ బస్సు ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం కు దగ్గర దిగవచ్చు. దిగవలసిన బస్ స్టాప్ పేరు : శ్రీనివాస కాలనీ బాస్ స్టాప్



పూర్తి వివరాలకు సంప్రదించండి : తుంగా శ్రీ 6301767565

ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి

Post a Comment

0 Comments