శ్రీరామ నామ స్మరణ కార్యక్రమము స్వరూపము
'శ్రీరామ సేవ సమితి' ఒకొక్క కార్యక్రమానికి ఒకొక్క స్వరూపము ఏర్పాటు చేసుకుంది. అదే విధముగా శ్రీరామ నామ స్మరణకు కూడా ఒక స్వరూపము ఏర్పాటు చేసుకుంది.
కార్యక్రమము ఇంటిలో అయితే వారి చుట్టూ ప్రక్కల 21 కుటుంబాలుకు తక్కువ కాకుండా బొట్టు పెట్టి పిలవలెను.
అదే గుడిలో అయితే ఆ బస్తీలో పిలుపునివ్వాలి
కార్యక్రమానికి కావాల్సినవి తెలుసుకుందాము :
- పట్టాభి షేకం ఫోటో
- అలంకరణకు పూలు
- 108 సార్లు నామ స్మరణకు 108 పూలు
- దీపాలు రెండు వైపులా రెండు
- కొబ్బరి కాయ
- ఆకు వక్కలు
- కర్పూరం
- అగర్బత్తీలు
- నావేద్యము (అటుకులు, బెల్లం, పానకము )
కార్యక్రమము పారంభము :
కార్యక్రమము గుడిలో అయితే ప్రారంభానికి 30 నిమిషాలు ముందు నైవేద్యం పెట్టె వారి ఇంటి నుంచి భజనగా గుడికి చేరుకోవలెను.
శ్రీరామ నామ స్మరణ కార్యక్రమము ఇంటిలో అయితే ప్రారంభానికి ముంది ఆ వీధిలో కొద్దీ దూరం శ్రీరామ నామ స్మరణ చేసుకుంటూ నగర సంకీర్తన చేయవలెను
ప్రారంభం
- నామ స్మరణ
- ప్రార్థన
- గణేష్ పాట - 01
- రాముని పాటలు - 06 ఆ పైన
- శ్రీరామ రామేతి - 3 సార్లు
- శ్రీరామ జయ జయ రామ జయ జయ రామ్ 108 సార్లు
- భగవద్గీత ఒక శ్లోకం మరియు తాత్పర్యము
- లింగాష్టకము
- హనుమాన్ చాలీసా 1 / 3 / 5 / 11 సార్లు
- హారతి
- శాంతి మంత్రము
- ప్రసాద వితరణ
0 Comments