AboutUs
శ్రీ రామ సేవా సమితి సభ్యులు ఆదర్శంగా నిలిచేలా పాటించవలసిన సూత్రాలు
నిత్యశ్రద్ధతో "శ్రీరామ" నామస్మరణ చేయడం ద్వారా మనస్సు పవిత్రమవుతుంది.
సదాచారమే జీవిత మార్గం :- మాట, మనసు, పని అన్నింటిలోని శ్రేష్ఠమైన నడవడికను కలిగి ఉండాలి.
భక్తి, నమ్మకంతో సేవ చేయాలి :- కార్యాలలో శ్రీరాముని అనుగ్రహమని భావించి, అహంకారము లేకుండా పరమభక్తితో చేయాలి.
శాంతి, సహనం అలవరచుకోవాలి — అన్ని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం, సహనంతో వ్యవహరించాలి.
సత్యవచనం పాటించాలి — ఎంతటి ఇబ్బంది వచ్చినా నిజాయితీతో ఉండాలి.
సకల జీవుల పట్ల దయా భావం కలిగి ఉండాలి :- పశుపక్ష్యాదుల పట్ల కూడా కరుణ చూపాలి.
అల్లరితనం, వాదప్రవణతలకు దూరంగా ఉండాలి:- సంయమనం, మర్యాదతో మాటలాడాలి.
సంస్థ లక్ష్యాలపై నిబద్ధత ఉండాలి :- శ్రీ రామ సేవా సమితి నియమ నిబంధనలను గౌరవిస్తూ లక్ష్య సాధనకు శ్రమించాలి.
భాగస్వామ్యంతో ముందుకు పోవాలి :- ఇతర సభ్యులతో ఐక్యతగా, సహకారంగా పనిచేసి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
0 Comments