సనాతన ధర్మం అనేది మన పురాతన భారతీయ సంస్కృతికి మూలాధారం. ఇది మన జీవన విధానం. అయితే, ఈ ధర్మాన్ని రక్షించడం ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండకూడదు. ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ, రక్షించే బాధ్యత కలిగి ఉండాలి. ఈ సార్వకాలిక సత్యాన్ని మనకు గుర్తు చేస్తూ 'తుంగా శ్రీ' గారు ఒక గొప్ప సందేశాన్ని అందిచారు.

సనాతన ధర్మం అనేది ధార్మికత, నీతి, దయ, సత్యం వంటి విలువల సమాహారం. దీన్ని కేవలం దేవాలయాలు లేదా పుస్తకాల మధ్య మాత్రమే కాక, మన జీవితంలోని ప్రతి క్షణంలో అనుసరించడం అవసరం. ధర్మాన్ని రక్షించడం అంటే శాస్త్రాలు చదవడం మాత్రమే కాదు. దాని ఆచరణే నిజమైన రక్షణ.

సనాతన ధర్మాన్ని రక్షించే బాధ్యతను ఎవరో ఒకరు తీసుకుంటారని ఎదురు చూస్తే అది అసమర్థతకు దారితీస్తుంది.

సనాతన ధర్మానికి రక్షకులు మనమే. మన ప్రవర్తన ద్వారా అది ఇతరులకు స్ఫూర్తి కలిగించాలి. ఎందుకంటే ఈ ధర్మం లోపల నుంచే వెలసేది.

ప్రతి ఒక్కరూ చిన్న స్థాయిలో అయినా ధర్మాన్ని కాపాడాలి. ఉదాహరణకు, నీ ఇంట్లో పెద్దల మాట వినడం, పర్యావరణాన్ని కాపాడడం, ఇతరుల పట్ల ఆదరాభావం చూపించడం వంటివి ధర్మరక్షణకు మొదటి అడుగులు. అంతే కాక సమాజంలో అజ్ఞానంతో దారి తప్పుతున్న వారికి సనాతన ధర్మం గురించి వివరించవలసిన భాద్యత కూడా మనపై ఉందని గ్రహించాలి. అజ్ఞానంతో నిండి సనాతన ధర్మమం పట్ల మనసులోని ద్వేషం, అసహనం వంటి దుష్ప్రవర్తనలను చూపేవారికి సనాతన ధర్మము గురించి వివరించి, వారిలో సనాతన ధర్మమం పట్ల ఉన్న ద్వేషం, అసహనం వంటివి నివారించడంతో కూడా సనాతన ధర్మాని రక్షణచవచ్చు.

అంతేకాదు, ధర్మాన్ని కాపాడే బాధ్యతకు భయం అవసరం లేదు. సిగ్గు పడవలసిన అవసరం లేదు. ఇది మన పరిధిలోనే ఉంది. మనం చేసే చిన్నచిన్న పనుల ద్వారానే పెద్ద మార్పులు వస్తాయి. ఒక వ్యక్తి మంచి మార్గం చూపితే, మరొకరు అతన్ని అనుసరిస్తారు. దీన్ని క్రమంగా పునరావృతం చేస్తూ సమాజంలో సనాతన ధర్మం మరింత బలపడుతుంది.

ముగింపు గా చెప్పాలంటే, ధర్మాన్ని కాపాడే బాధ్యత. నీవు ఎంచుకోవాలి, నీలో ఉన్న ఆధ్యాత్మికతను వెలికితీసి ఆచరణలో పెట్టాలి. ఎవరో రారు, నువ్వు రావాలి! అందుకే ‘తుంగా శ్రీ’ గారు ఇలా చెపుతుంటారు — "ఎవరో రక్షిస్తారని ఎదురు చూడకు, నువ్వే ఆ ధర్మానికి రక్షకుడవు"