కార్యక్రమం సంకల్ప వివరణ
తేదీ: 20 మార్చ్ 2027, శనివారం నాటికి 11000 మందితో నామ నామ స్మరణ. తదుపరి నమోదు చేసిన నామ స్మరణ పత్రాలను భద్రాద్రి రామయ్య చెంతకు చేర్చడం ఉంటుంది
లక్ష్యం:
ఇంటిలో దీపం వెలిగించి లేదా గుడిలో "శ్రీ రామ జయ రామ జయ జయ రామ" అని జపిస్తూ ఒక పత్రాన్ని నింపవలసి ఉంటుంది. ఇలా ప్రతి నెల 1000 మందితో ప్రారంభించి మొత్తం 11,000 మంది చేత శ్రీ రామ నామ స్మరణ జపం చేయించడం.
కొత్తగా 108 మందికి హనుమాన్ చాలీసా నేర్పించడం నేర్చుకున్న వారు వీలును బట్టి ప్రతి నెలా జరిగే 108 సార్లు హనుమాన్ చాలీసాలో పాల్గొనవలసి ఉంటుంది.
శ్రీ రామ నామ స్మరణ ప్రాముఖ్యత
“రామ” నామం అనేది పరమ పవిత్రమైనది. శాస్త్రాలలో “రామ నామం” జపించడం ద్వారా మనస్సు ప్రశాంతం అవుతుంది, పాపాలు తొలగుతాయి, భక్తి పెరుగుతుంది అని చెప్పబడింది.
ఈ జప కార్యక్రమం ద్వారా:
- వ్యక్తిగత శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల
- కుటుంబాలలో సుఖశాంతులు
- సమాజంలో సానుకూల వాతావరణం
వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
హనుమాన్ చాలీసా శిక్షణ ప్రాముఖ్యత
హనుమాన్ చాలీసా అనేది భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. దీన్ని నేర్చుకోవడం ద్వారా:
- భయం తగ్గుతుంది
- ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
- శ్రీ హనుమంతుని కృప లభిస్తుంది
108 మందికి దీనిని నేర్పించడం ద్వారా, భక్తి సంప్రదాయం కొత్త తరాలకు చేరుతుంది.
కార్యక్రమం అమలు విధానం
నెలవారీ ప్రణాళిక
- ప్రతి నెల ఒక ప్రత్యేక తేదీ నిర్ణయించి భక్తుల సమాహారం
- కొంత మంది చొప్పున పాల్గొనేలా ప్రయత్నం చేయాలి
- పాలుగొన్న వారిచే నామ స్మరణ చేసి నమోదు ప్రక్రియ చేయాలి
హనుమాన్ చాలీసా శిక్షణ
- హనుమాన్ చాలీసా నేర్పడానికి ప్రత్యేక సభ్యులు
- పిల్లలు, యువత, మహిళలకు విడివిడిగా నేర్పించే ప్రయత్నం
భక్తి కార్యక్రమాలు
- భజనలు, కీర్తనలు
- ధర్మ ప్రసంగాలు
- సత్సంగాలు
సామాజిక ప్రయోజనాలు
- సనాతన ధర్మం పై అవగాహన పెరుగుతుంది
- యువతలో మంచి విలువలు ఏర్పడతాయి
- సమాజంలో ఐక్యత మరియు సత్సంబంధాలు పెరుగుతాయి
ముగింపు
ఈ కార్యక్రమం ఒక సాధారణ భక్తి కార్యక్రమం కాదు. ఇది సనాతన ధర్మాన్ని కాపాడే, భక్తిని విస్తరించే మహోన్నత యజ్ఞం. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని “రామ నామం” మహిమను అనుభవించాలి.
“శ్రీ రామ జయ రామ జయ జయ రామ” నామస్మరణతో సమాజం శాంతిమయం కావాలి.
వివరాలకు సంప్రదించండి : తుంగా శ్రీ +91 6301767565
ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి
0 Comments