Header Ads Widget

2026 గీతా ప్రచార మహాయజ్ఞం మరియు గీతా జయంతి మహోత్సవం

Sri Rama Seva Samiti

"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః । తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥"

శ్రీమద్భగవద్గీత భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి జీవన మార్గదర్శిని. భగవంతుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి ఉపదేశించిన ఈ దివ్య జ్ఞానం నేటికీ మానవాళికి శాంతి, ధర్మం, కర్తవ్యనిష్ఠలను బోధిస్తోంది.

ఈ మహత్తర సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరవేయాలనే పవిత్ర సంకల్పంతో 2026 జూలై 29 నుండి డిసెంబర్ 15 వరకు "గీతా ప్రచార కార్యక్రమం" నిర్వహించబడుతుంది.

ఈ ప్రచారంలో భాగంగా 21 బస్తీలో ఉండే విద్యాసంస్థలు, దేవాలయాలు మరియు భక్తుల ఇళ్లలో గీతా పారాయణం, గీతా శ్లోకాల బోధన, గీతా సందేశ సభలు, యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, మహిళల గీతా అధ్యయన వేదికలు నిర్వహించబడతాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక గీతా గ్రంథం ఉండాలి, ప్రతి వ్యక్తి రోజూ కనీసం ఒక శ్లోకం చదవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం సాగుతుంది.

గీతా బోధన ద్వారా సమాజంలో ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం, దేశభక్తి మరియు కుటుంబ విలువలు మరింత బలపడతాయి. యువత చెడు అలవాట్లకు దూరమై సత్ప్రవర్తన వైపు అడుగులు వేయడానికి గీతా సందేశం ఎంతో దోహదపడుతుంది.

ఈ ప్రచార కార్యక్రమానికి ముగింపుగా 20 డిసెంబర్ 2026, ఆదివారం అత్యంత వైభవంగా గీతా జయంతి మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా శ్రీమద్భగవద్గీతలోని 18 అధ్యాయాలకు ప్రతీకగా ఈ 18 యజ్ఞాలు నిర్వహించబడతాయి. ప్రతి యజ్ఞం ద్వారా ధర్మరక్షణ, లోకక్షేమం, కుటుంబ శాంతి, దేశాభివృద్ధి, విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి.

ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి భక్తుడు పాల్గొనాలని ఆశిస్తున్నాము. గీతా చదవడం మాత్రమే కాదు, గీతా చెప్పిన ధర్మాన్ని జీవితంలో అమలు చేయడమే నిజమైన గీతా సేవ.

"ఇంటింటా గీత - మన జీవితానికి దివ్య మార్గదర్శి" అనే నినాదంతో జరిగే ఈ గీతా ప్రచార ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని హృదయపూర్వక ఆహ్వానం.

వివరాలకు సంప్రదించండి : తుంగా శ్రీ +91 6301767565

జై శ్రీకృష్ణ!
జై శ్రీమద్భగవద్గీత!
ధర్మో రక్షతి రక్షితః!

ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి

Post a Comment

0 Comments