Header Ads Widget

ఆహ్వానము - గోటి తలంబ్రాలు ఊరేగింపు - శ్రీ రామ సేవా సమితి

Goti Talambralu 2026


శ్రీ సీతా రామ కళ్యాణం అనేది సనాతన ధర్మంలో ప్రముఖమైన మరియు పవిత్రమైన వేడుక. అట్టి సీతా రామ కళ్యాణ వివాహం అత్యంత సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్దతిలో నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవంలో "తలంబ్రాలు" అను ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. ఈ తలంబ్రాలు తల మీద కురిపించడం ఒక సాంప్రదాయద్దమైన ఆనందోత్సవం. ఈ తలంబ్రాలను శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు రామ నామము జపిస్తూ అత్యంత భక్తితో చేతితో ఒలవడము జరుగుతుంది. ఇలా ఒలిచిన తలంబ్రాలును ప్రతి సంవత్సరం ఊరేగింపు జరిపినట్టు, ఈ సంవత్సరం కూడా ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం, సంజయ్ గాంధీ నగర్ నుంచి హర హర క్షేత్రం, సంజయ్ గాంధీ నగర్ వరకు ఊరేగింపు జరుగుతుంది.
ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు


తేదీ : 22 మార్చ్ 2026 మంగళవారం
స్థలం : ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం
సంజయ్ గాంధీ నగర్, గాజుల రామారం రోడ్డు,
షాపూర్ నగర్, భాగ్యనగర్
సమయం : ఉదయం 9.30 నిమిషాల నుంచి ప్రారంభం
9.30 నిమిషాల నుంచి 10.30 వరకు పూజ, శ్రీ రామ నామ స్మరణ, భజన పాటలు (ఒడ్లు ఒలవాలి అనుకునే వారు ఈ సమయంలో కొన్ని ఒలవవచ్చు )
ఉదయం 10.30 నిమిషాల నుంచి ఉరేగింపు తో హర హర క్షేత్రం, సంజయ గాంధీ నగర్ కు బయలు దేరడం
హర హర క్షేత్రంలో తలంబ్రాలు అప్పజెప్పి, తీర్థం తీసుకోవడంతో ముగింపు ఉంటుంది.

గమనిక : ఉదయం 10.00 గంటల లోపు ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయంకు చేరుకోగలరని మనవి.

ఒడ్లు ఒలిచిన వారు ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం కు తీసుకురాగలరని మనవి

మీతోపాటు మీ కుటుంభం సభ్యులు మరియు మీ చుట్టూ ప్రక్కల వారినీ తీసుకు రాగలరు. ఒడ్లు ఒలవకున్నా ఈ మహోత్తరమైన కార్యక్రమములో పాల్గొనవచ్చు



పూర్తి వివరాలకు సంప్రదించండి : తుంగా శ్రీ 6301767565

ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి

Post a Comment

0 Comments